https://oktelugu.com/

Amit Shah : కాశ్మీర్ లో జమాతే ఇస్లామీ ఎందుకు యుటర్న్ తీసుకుంది?

కాశ్మీర్ లో జమాతే ఇస్లామీ ఎందుకు యుటర్న్ తీసుకుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2024 / 12:49 PM IST

    కాశ్మీర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని అటు మోడీ, ఇటు అమిత్ షా భుజానకెత్తుకున్నాడు. అమిత్ షా అయితే హిందీ ప్రభావిత రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే తాజాగా ప్రచారం పక్కనపెట్టి అర్ధాంతరంగా అమిత్ షా కాశ్మీర్ వెళ్లడం చర్చనీయాంశమైంది.

    నిన్న రాత్రి శ్రీనగర్ వెళ్లిన అమిత్ షా అక్కడి సామాజికవర్గాల నేతలు, ప్రజలతో భేటి అయ్యారు. పహాడీలు, గుజ్జర్ బర్కర్ వాలాలు వచ్చి తమకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

    ఇంతటి బిజి షెడ్యూల్ ను వదిలిపెట్టి రెండు రోజుల పాటు కశ్మీర్ లో అమిత్ షా పర్యటించడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతున్న గొడవల నేపథ్యంలో అమిత్ షా వెళ్లారని అంటున్నారు. పీవోకే స్వాధీనానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

    ఎన్నికల బిజీ షెడ్యూల్ ను వదిలి కశ్మీర్ వెళ్లిన అమిత్ షా తీరుపై సంచలనం సృష్టిస్తోంది. కశ్మీర్ లో ఓ సంఘటన జరిగింది. జమాతే ఇస్లామీ నాయకుడు గులాం ఖాదీర్ వనీ ఒక సంచలన ప్రకటన చేశారు. మా మీద బ్యాన్ ఎత్తేస్తే మేం కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని నమ్మని వాళ్లు ఇలా ప్రకటించడం సంచలనమైంది.

    కాశ్మీర్ లో జమాతే ఇస్లామీ ఎందుకు యుటర్న్ తీసుకుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.