Sabarimala gold missing: శబరిమల ఆలయం.. భక్తులు అత్యంత విశ్వాసంతో.. నిష్టగా కొలిచే దేవాలయం. ఇటీవల కాలంలో వివాదాలు ఎక్కువవుతున్నాయి. అప్పట్లో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదమైంది. భక్తులు అత్యంత విశ్వాసంతో సమర్పించే బంగారం ఏమైందో తెలియడం లేదు.
2015లో అయ్యప్ప స్వామి దేవాలయం ముందు ఇరువైపులా ఉండే ద్వారపాలకులకు బంగారుతాపడం చేశారు. 18 మెట్లు బంగారం తాపడం చేశారు. లోపల గోడలకు కూడా బంగారు తాపడం చేశారు.
2019లో పోత సరిగ్గా లేదని దాన్ని తీసేసి మెయింటేనెన్స్ కోసం మద్రాస్ కు పంపించారు. స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థ దీని మెయింటనేన్స్ చేసింది. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెన్నై చేరడానికి 30 నుంచి 40 రోజులు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న. అసలు బంగారు ప్లేట్లుకావని.. కాపర్ ప్లేట్ల మీద బంగారం కలర్ వేశారని ఆరోపణలు వస్తున్నాయి.
42 కేజీల బంగారం ఉండాలి. ప్రస్తుతం 38 కేజీలున్నాయి. నాలుగున్నర కేజీలే ప్రస్తుతం ఉన్నాయి. దీన్ని ఒక్కరే చేశారా? వెనుకల ఎవరైనా ఉన్నారా? అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శబరిమల ఆలయంలో బంగారం దొంగిలించింది ఎవరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.