Visakhapatnam Steel Plant : విశాఖ ఉక్కుకు 11వేల 440 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఇంత పెద్ద భారీ సాయం చేసినప్పుడు విశాఖ ఉక్కుపై కార్మిక సంఘ నాయకులు స్వాగతించాలి. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ట్వీట్ చేశారు. అయినా కార్మిక నాయకులు ఎవరూ మోడీని కొనియాడలేదు. కార్మిక సంఘాలు అన్నీ రాజకీయ ప్రేరేపిత సంఘాలు. ప్రధానంగా సీఐటీయూ, ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీలు కమ్యూనిస్టు, కార్మిక సంఘాలే.. వాటికి మోడీని అభినందించడం ఏమాత్రం గిట్టని పని.. అందుకే ఇంత పెద్ద సాయం చేసినా విశాఖలో హర్షించడం లేదు. ఇది చాలా దారుణమనే చెప్పాలి.
మోడీ ‘విశాఖ సెంటిమెంట్’ను గుర్తించి దాన్ని గౌరవించకపోతే ఇంత పెద్ద 11 వేల కోట్ల ప్యాకేజీ వచ్చి ఉండేది కాదు.. మొన్ననే విశాఖకు వచ్చి 1.80వేల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. రైల్వే జోన్ ప్రకటించారు. అయినా మోడీపై సానుకూలత రాలేదు. యాంటీ మోడీ సిస్టం ఎగదోస్తూనే ఉన్నారు.
ఆంధ్రాకి మంచి రోజలు వచ్చాయి. ఈరోజు విశాఖ ఉక్కుకు 11 వేల కోట్ల భారీ ఆర్థికసాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికీ ఆంధ్రులు ప్రధాన కోరుకుంటున్నది అమరావతి, రెండోది పోలవరం నిర్మాణం పూర్తవ్వాలి. మూడోది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలన్న కోరికను కేంద్రం నెరవేర్చింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని గుర్తించిన కేంద్రం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
