https://oktelugu.com/

Special Trains: సంక్రాంతి తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక రైళ్లు.. అమార్గాల్లోనే

దక్షిణ మధ్య రైల్వే( South Central Railway) మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండగ తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Written By: , Updated On : January 18, 2025 / 11:35 AM IST
Ration Cards(1)

Ration Cards(1)

Follow us on

Special Trains: సంక్రాంతి సంబరాలు( Pongal festival ) ముగిసాయి. పండగ కోసం సొంత గ్రామాలకు వచ్చిన వారు స్వస్థలాలకు తిరుగు ముఖం పడుతున్నారు. దీంతో వాహనాలు రద్దీగా మారుతున్నాయి. బస్సులతో పాటు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఈనెల 20 వరకు ఈ బస్సులు నడవనున్నాయి. మరోవైపు సంక్రాంతి తిరుగు ప్రయాణాలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు నడపాలని డిసైడ్ అయ్యింది. అయితే దీనిపై ప్రచారం లేకపోవడంతో చాలామంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తిరుగు ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నారు.

* దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్రకటన
సంక్రాంతి తిరుగు ప్రయాణాల కోసం రైల్వే శాఖ( railway department) అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. కేవలం సంక్రాంతి తిరుగు ప్రయాణం చేసే వారి కోసమే ఈ ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* ఆయా స్టేషన్ల నుంచి
ఈనెల 18న కాకినాడ( Kakinada) నుంచి ఒక ప్రత్యేక రైలు చర్లపల్లి స్టేషన్ కు బయలుదేరనుంది. అదే రోజు విశాఖ నుంచి రెండు రైలు చర్లపల్లికి ప్రారంభం కానున్నాయి. ఈనెల 19న ఆదివారం నరసాపురం నుంచి ఒకటి, విశాఖ నుంచి మరో రైలు చర్లపల్లి కి చేరుకొని ఉన్నాయి. ఇక ఆదివారం చర్లపల్లి నుంచి విశాఖపట్నం కు ఒక రైలు, భువనేశ్వర్ కు మరో రైలు బయలుదేరుతుంది. ఈనెల 20న చర్లపల్లి నుంచి విశాఖకు ఇంకో ప్రత్యేక రైలు కూడా నడుపుతున్నట్లు శ్రీధర్ వెల్లడించారు.

* టైమింగ్స్ ఇలా
విశాఖ ( Vishakha )నుంచి చర్లపల్లి భువనేశ్వర్ రైలు శనివారం సాయంత్రం 7:45 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరిగి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చర్లపల్లి లో బయలుదేరి.. సాయంత్రం ఏడున్నర గంటలకు విశాఖ చేరుకుంటుంది. అనంతరం 7:50 గంటలకు విశాఖలో బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 2:15 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. మరో విశాఖ చర్లపల్లి రైలు శనివారం సాయంత్రం 6: 20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరిగి ఆదివారం ఉదయం పది గంటలకు చర్లపల్లి లో బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు విశాఖ చేరుతుంది. ఇంకో విశాఖ చర్లపల్లి రైలు ఆదివారం సాయంత్రం 6 20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి లో బయలుదేరి.. రాత్రి 10 గంటలకు విశాఖ చేరుతుంది.