Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తిరుమల సందర్శించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుమారుడి ఆరోగ్యం కోసం ఆమె ఎంతగానో ఆందోళన చెందారని, అందుకే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలుస్తోంది. ఆమె తలనీలాలు సమర్పించి, విరాళం అందజేసి అన్నదానం కూడా చేశారు.
అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె తిరుమల నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడం. ఇది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన సంఘటనతో పోల్చి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల సందర్శించినప్పుడు నిబంధనలు పాటించలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా, అన్నా లెజినోవా తన కొడుకు కోసం తల్లిగా పడిన తపనను, తిరుమల నియమాలను ఆమె గౌరవించిన తీరును పలువురు మెచ్చుకుంటున్నారు.
అన్నా లెజినోవా తిరుమల యాత్ర దేశం మొత్తం చర్చనీయాంశమయింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.