Deputy CM Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. అడవి తల్లి ఒడిలో నడిచిన పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు గిరిజనుల హృదయాలను తాకాయి. ఎట్టకేలకు తమ తరపున గళం విప్పే నాయకుడు దొరికాడని వారు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. తమ కోసం కొండలు, కోనలు దాటి వచ్చిన పవన్ కళ్యాణ్‌పై వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. “నేనున్నాను మీ కోసం” అంటూ వచ్చిన నాయకుడిని చూసి ప్రజలు పులకించిపోయారు.
ఇంతకు ముందు సరైన ఆదరణ లేకపోవడం వల్లే గిరిజనులు చాలాసార్లు మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారు. సరైన మార్గనిర్దేశం లేకనే గంజాయి సాగు చేసి తప్పుదోవ పట్టారు. ప్రేమ, ఆప్యాయత కరువవడంతోనే బాధ్యత లేకుండా అడవులకు నిప్పు పెట్టేవారు. కానీ ఇప్పుడు అధికారం చూపకుండా, వారిలో ఒకరిగా, పెద్దన్నగా మారిన పవన్ కళ్యాణ్ యొక్క తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
గిరిజనుల జీవితాలు బాగుండాలని పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటిస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. కేవలం పది కుటుంబాలు ఉన్నా సరే అక్కడికి రోడ్డు వేయిస్తామని, సంక్షేమం మరియు అభివృద్ధి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా చేతబడులు, మూఢనమ్మకాలను విడనాడాలని గిరిజనులకు సూచించారు.
పర్యాటక రంగం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని, టూరిజంను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటిస్తూ గిరిజనుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ అండతో ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. దీనిపై రామ్ గారి విశ్లేషణను దిగువ వీడియోలో చూడగలరు.