India-UK trade deal: పార్లమెంట్ లో ప్రతీరోజు ప్రతిపక్షాలు స్తంభింపచేస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ప్రభుత్వం ఓకే అన్నది. బీహార్ లో ఎన్నికల్లో ఓట్ల రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక కాంగ్రెస్ నిరసనలు చేస్తూ వీధిపోరాటాలు చేస్తోంది.
ఒక వైపు ఇది జరుగుతుంటే.. లండన్ వెళ్లి.. యూకేతో ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. కొట్టుకునే వారు కొట్టుకుంటారని.. బ్రిటన్ తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇరుదేశాలకు విన్ విన్ ఒప్పందం ఇదీ. మోస్ట్ కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ ఏది అంటే బ్రిటన్ తోనే అని చెప్పొచ్చు.
టాక్స్ 2022 జనవరిలో మొదలై.. ఇప్పటికి పూర్తయ్యాయి. ఫైనల్ సంతకాలు నిన్న మోడీ, స్టీవ్ స్టార్మర్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ఎందుకు గేమ్ చేంజర్ అంటే.. మనకు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడే చిన్న పరిశ్రమలు, వ్యవసాయంపై ఉత్పత్తులపై టారిఫ్ లు లేకుండా బ్రిటన్ అనుమతిస్తుంది. స్వేచ్ఛగా మనం ఎగుమతులు చేయవచ్చు.
ప్రతిపక్షాలు పార్లమెంటులో కుస్తీ మోడీ ఇంగ్లాండ్ తో వ్యాపార దోస్తీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
