Punjab : ఎట్టకేలకు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం ఒక కొలిక్కి వచ్చింది. పంజాబ్ లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఊహించకుండా ఉంది. పంజాబ్ ప్రత్యేకంగా ఉంటుంది. దేశానికి, అక్కడ రాష్ట్రానికి విభిన్న రాజకీయం ఉంటుంది.
హర్యానా, ఢిల్లీ, గుజరాత్ లలో కాంగ్రెస్, ఆప్ ఒప్పందం చేసుకొని పోటీచేశాయి. పంజాబ్ లో మాత్రం విడి విడిగా పోటీచేయాలని ఒప్పందం చేసుకున్నాయి.
పంజాబ్ వరకూ విడివిడిగా పోటీచేస్తామని.. మిగతా రాష్ట్రాల్లో కలిసి పోటీచేయాలన్న ఆప్, కాంగ్రెస్ తీరు చూస్తుంటే జనాలను అమాయకం చేయడం తప్ప మరొకటి కాదు..
2019 ఎన్నికల్లో అకాలీదళ్ బీజేపీ కలిసి పోటీచేశాయి. ఈ రెండు పార్టీలు మూడు దశాబ్ధాలుగా 27 ఏళ్లు కలిసి పోటీచేశాయి. 2020లో రైతుల ఆందోళనతో ఈ రెండు పార్టీలు విడిపోయాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విడివిడిగా పోటీచేసి ఓడిపోయారు. ఆప్ క్లీన్ స్వీప్ చేసేసింది.
నాలుగు పార్టీల పంజాబ్ కుస్తీ ఎలా ఉండబోతుంది? బీజేపీ పంజాబ్ లో ఒంటరి పోరు లాభిస్తుందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.