Political Crises: మూడు కోర్టులు.. మూడు రాజకీయ సంక్షోభాలను సృష్టించాయి. పార్లమెంట్ చేసే తీర్మానాలు.. కార్యవర్గం తీసుకునే చర్యలు.. కోర్టు తీర్పులు కూడా ఎంత ప్రమాదకరమో ఈ మూడు ఉదాహరణలు చాటి చెబుతున్నాయి.
2023 మార్చి 27.. మణిపూర్ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పు వెబ్ సైట్ లో పెట్టేదాకా ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 19న 2023న వెబ్ సైట్ లో పెట్టారు. ఏంటా తీర్పు అని చూస్తే.. ‘మణిపూర్ లో దశాబ్ధాలుగా నడుస్తున్న సామాజిక అంశాన్ని తీర్పు చెప్పారు. మణిపూర్ లో తీవ్రవాదులతో స్వాతంత్ర్యం వచ్చాక జరగని ఒప్పందాలు ఇక్కడ ఉన్నాయి. మైతీలు, కుకీలు, నాగాలు తన్నుకు చస్తున్నారు. వీరందరిపై కోపం భారత ప్రభుత్వంపై ఉంది. అటువంటి చోట ఈ తీర్పు చిచ్చు పెట్టింది.
కుకీలు ఎస్టీలు, నాగాలు ఎస్టీలు.. ఇక తీర్పులో మైతీలు కూడా ఎస్టీ అని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎస్టీలు ప్రకటించే అధికారం కోర్టులకు లేదు. ఈ తీర్పుతో మణిపూర్ భగ్గుమన్నది.. కుకీలు, మైతీలు నరుక్కున్నారు. ఒక సింగిల్ జడ్జి నుంచి వచ్చినతీర్పుతో మణిపూర్ అంటుకుంది.
మూడు కోర్టు తీర్పులు, మూడు రాజకీయ సంక్షోభాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
