AIADMK Thevar support decline: తమిళనాడు రాజకీయాలు చకచకా మర్పులకు గురవుతున్నాయి. తమిళనాడులో ఈ కూటములు, పోలరైజేషన్ అంతా కూడా ఇప్పుడే మొదలైంది. ఇది ఎండ్ కాదు.. మూడు కూటముల్లో ఏ పార్టీ ఎక్కడ ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం.
ప్రతిపక్ష పార్టీల్లో అన్నాడీఎంకేలో చాలా కలవరపాటు సంఘటన జరుగుతోంది. ఓబీసీల్లో మూడు ప్రధాన కమ్యూనిటీలున్నాయి. దక్షిణాన డెల్టా ప్రాంతంలో దేవరలు, పశ్చిమ గౌండర్లు, ఉత్తరాన వండియార్లు ఉన్నారు. మిగత కులాలు చూస్తే నాడార్లు, మొదిలియార్స్, చిట్టీయార్స్ లాంటి వారు ఉన్నారు.
అందులో దేవరల గురించి తెలుసుకుందాం. తమిళనాడులో దేవరలు కీలకంగా ఉన్నారు. దక్షిణాది జిల్లాలు అన్నింటిలో.. కావెరీ జిల్లాలు, మధురై, తంజావురు, రామనాథపురం వంటి ఏరియాల్లో గణనీయంగా దేవరలు ఉన్నారు. వీళ్లు మొదట్లో ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ వైపు ఉండేవారు.
దేవర్లు అన్నాడీఎంకే నుంచి దూరం జరిగారా? వారిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.