https://oktelugu.com/

Annamalai : ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నామలై ప్రచారానికి డిమాండ్

ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నామలై ప్రచారానికి డిమాండ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 04:01 PM IST

    Annamalai : అన్నామలై మళ్లీ వార్తల్లోకి వస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడు పోలింగ్ ముగిసింది. అంతకు రెండు నెలల ముందు నుంచి అన్ని మీడియా చానెల్స్ , సోషల్ మీడియాలో అన్నామలై లేకుండా ముందుకు సాగలేదు. ఏప్రిల్ 19 తర్వాత గ్యాప్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అన్నామలై వెంటనే తన ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు.

    కేరళ త్రివేండ్రంలో అన్నామలైకి విశేష ఆదరణ దక్కింది. దక్షిణాదిన అంతగా ఆకర్షించిన నాయకుడు లేరు. ఎక్కడికి వెళ్లినా అన్నామలైకు ఆదరణ దక్కింది. కేరళలోని అన్ని చోట్ల అన్నా మలై ప్రసంగానికి ఎదురుచూసి ప్రసంగించారు. కేరళలో ఎన్నికలు ముగియగానే కర్ణాటకలో అన్నామలై ప్రత్యక్షమయ్యారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ఎన్నికల్లో ప్రత్యక్షమై ప్రచారం చేశారు. కర్ణాటకలో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. కన్నడ కూడా అన్నామలైకి వచ్చు. సో అక్కడా ప్రచారం చేసి బీజేపీ కోసం పాటుపడ్డారు.

    ఇక ఢిల్లీలో జరిగిన బీజేపీ సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లూయేన్సర్స్ సమావేశంలో అన్నామలై మాట్లాడుతుంటే చప్పట్లతో హోరెత్తించారు.

    ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నామలై ప్రచారానికి డిమాండ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.