https://oktelugu.com/

Dry Valleys: 20 లక్షల ఏళ్లుగా వర్షాలు లేవా? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం?

అంటార్కిటికా ఖండం ఉత్తర వైపు కొన్ని పొడి ప్రాంతాలు ఉన్నాయి. వీటిని డ్రైవ్యాలిస్ అంటారు. ఇక్కడ గత 20 లక్షల సంవత్సరాలుగా ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. అలాగని మంచు కూడా కురవలేదట.

Written By:
  • Dharma
  • , Updated On : May 7, 2024 / 03:58 PM IST

    Dry Valleys

    Follow us on

    Dry Valleys: సాధారణంగా కొద్ది నెలల పాటు వర్షం లేకపోతేనే విలవిలలాడిపోతాం. ఉష్ణోగ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతాం. కానీ అక్కడ లక్షల సంవత్సరాలయ్యింది చిన్నపాటి చినుకు పడి. మీరు విన్నది నిజమే. అటువంటి ప్రాంతం ప్రపంచంలో ఒకటి ఉంది. గత 20 లక్షల ఏళ్లుగా అసలు వర్షపు చుక్క పడలేదట. అలాగని అది ఎడారి ప్రాంతం కూడా కాదు. నిత్యం నీరు గడ్డకట్టి ఉండే ప్రాంతం. కానీ అది కరువు ప్రాంతంగా మారిపోయింది.

    అంటార్కిటికా ఖండం ఉత్తర వైపు కొన్ని పొడి ప్రాంతాలు ఉన్నాయి. వీటిని డ్రైవ్యాలిస్ అంటారు. ఇక్కడ గత 20 లక్షల సంవత్సరాలుగా ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. అలాగని మంచు కూడా కురవలేదట. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కారణంగానే వర్షపాతం నమోదు కావడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి ఉంటుంది. గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ డ్రై వాలీస్ గా పిలిచే ప్రాంతంలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. చుట్టూ మంచు కొండల కారణంగా డ్రై వ్యాలీస్ వైపు ఏమాత్రం తేమలేని పొడి గాలులు వీస్తుంటాయి. గాల్లో తేమ లేకపోవడంతో ఇక్కడ వర్షాలు కురువవని శాస్త్రవేత్తలు గుర్తించారు.

    అయితే భూమ్మీద వర్షాలు పడని ప్రాంతం ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే దాదాపు 23 లక్షల ఏళ్ల కిందట కూడా విపరీతమైన వర్షాలు పడేవట. 20 లక్షల ఏళ్ల పాటు విరామం లేకుండా వర్షాలు కురిసేవట. ఆ సమయంలో భూమి మీద మానవ మనుగడ లేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. లక్షల సంవత్సరాల కిందట ఇప్పటి మాదిరిగా భూమి ఖండాలుగా విభజించలేదు. భూమి మొత్తం ఒకవైపు.. సముద్రం మరోవైపు ఉండేది. అయితే వాతావరణం లో విపరీతమైన వేడి కారణంగా సముద్రపు నీరు ఆవిరై మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగి లక్షల ఏళ్ళు వర్షాలు కురిసాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ అంటార్కిటికా ఖండంలో మాత్రం 20 లక్షల సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడం అనేది మాత్రం వింతే. దానికి వాతావరణ పరిస్థితులే కారణమని.. అంతకుమించిన కారణాలు లేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.