https://oktelugu.com/

CPM : కేరళలో మైనారిటీ మత వాదాన్ని రెచ్చగొడుతున్న సీపీఎం

కేరళలో మైనారిటీ మతవాదాన్ని రెచ్చగొడుతున్న సీపీఎం రాజకీయాలపై‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By:
  • Neelambaram
  • , Updated On : April 2, 2024 / 04:27 PM IST

    CPM : సీపీఎం ఒకనాడు వెలుగు వెలిగిందని చెప్పొచ్చు. అప్రతిహతంగా మూడు దశాబ్ధాలకు పైగా సీపీఎం పశ్చిమ బెంగాల్ ను పరిపాలించింది. త్రిపుర, కేరళలో వరుసగా అధికారంలోకి వచ్చింది. ఒక విప్లవ పార్టీగా ప్రజల ముందుకు వచ్చింది. సీపీఐ రాజీపడుతోందని.. ప్రజల పక్షాన ఉంటామని 1966లో సీపీఎం పుట్టడం.. ఆ నాడు ఈ నాయకులు అంటే జనాల్లో ఎంతో ఇమేజ్ ఉండేది. వీళ్లు మీటింగ్ లు పెడితే జనం తండోపతండోలుగా వచ్చేవారు. మొట్టమొదట అధికారంలోకి ఆంధ్రలోనే వస్తుందని అనుకున్నా అది కొన్ని కారణాలతో సాధ్యపడలేదు.

    విడిపోయిన సీపీఐ , సీపీఎంకు అధినాయకులు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్లు తెలుగువాళ్లే కావడం గమనార్హం. సీపీఐకి చండ్ర రాజేశ్వరరావు… సీపీఎంకు పుచ్చలపల్లి సుందరయ్యలకే నాయకులుగా నాడు వెలుగు వెలిగారు. నక్సలైట్లుగా మారిన మావోయిస్టు పార్టీకి కూడా తెలుగువాళ్లే నాయకులుగా ఉండడం గమనార్హం. కొండపల్లి సీతారామయ్య నుంచి ఇప్పుడు గణపతి వరకూ కొనసాగుతున్నారు.

    ఇక కమ్యూనిస్టు నేతలంతా విపరీతమైన అభిమానం ఉండేది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఒక్క సీపీఎం పార్టీకే 43 సీట్లు వచ్చాయి. సీపీఐకి ఒక 10 వచ్చాయి. వామపక్ష పార్టీలు మరో రెండింటికి కలిపి 2004లో 57 సీట్లు వచ్చాయి.. దేశ చరిత్రలో ఇప్పటివరకూ కమ్యూనిస్టులకు అదే ఎక్కువ.

    కేరళలో మైనారిటీ మతవాదాన్ని రెచ్చగొడుతున్న సీపీఎం రాజకీయాలపై‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..