US tariffs on India : టారిఫ్ ల యుద్ధం నడుస్తోంది. భారత్ పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటికే 25 శాతం పన్ను వేయగా.. 27వ తేదీ నుంచి మరో 25 శాతం వేశాడు ట్రంప్. ట్రేడ్ డీల్ కుదరలేదని.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ మేరకు భారత్ పై 50 శాతానికి సుంకాలను పెంచాడు.
అమెరికాతో ట్రేడ్ డేల్ లో ప్రధానంగా వ్యవసాయం, పాడిపరిశ్రమలోకి అమెరికా ప్రవేశాన్ని భారత్ నిషేధిస్తోంది. ఈ రెండింటి గురించి అడగొద్దని వాదిస్తోంది. కానీ అమెరికా మాత్రం ఈ రెండింటిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే పీఠముడిగా ఉంది.
ఏ దేశం డిమాండ్లు ఆ దేశానికి ఉన్నాయి. 45 శాతం భారత్ ఆధారపడి ఉన్న ఈ రెండు రంగాలపైన ప్రపంచానికి మార్కెట్ ఇవ్వడానికి భారత్ ఒప్పుకోవడం లేదు. ఎంత టారిఫ్ వేసినా భారత్ ఆ రెండు రంగాల్లోకి ప్రపంచ దేశాలను అనుమతించడం లేదు.
రష్యా నుంచి యూరప్ ఎక్కువగా వ్యాపారం చేస్తోంది. చైనా, అమెరికా, జపాన్ లు కూడా వ్యాపారం చేస్తున్నాయి. అయినా భారత్ నే ట్రంప్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటి?
టారిఫ్ యుద్ధంలో దేశమంతా ఒక్కటయ్యింది ఒక్క రాహుల్ గాంధీ తప్ప.. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.