Bangladesh-Myanmar : 2024 ముగిసింది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం.. ఈ మహ్మద్ యూనస్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై తీవ్ర దాడులు జరగడం చూస్తున్నాం. మయన్మార్ అంతర్గత పోరాటంలో మునిగిపోయింది. మన సరిహద్దు రాష్ట్రాలైన అరఖాన్, చిన్ రాష్ట్రాలు తిరుగుబాటు దారుల వశమైంది. 2024 అంతా గందరగోళంగా మారింది.
ఒక సంఘటన భారత్ ను వెంటాడుతోంది. భారత్ విభజన చేసిన సమయంలో పంజాబ్, బెంగాల్ ను విభజించిన బ్రిటీష్ అధికారి రాడ్ క్లిఫ్ . బ్రిటీష్ నుంచి రప్పించి మ్యాపులను ఆయన ముందు ఉంచి రెండున్నర నెలల్లో దేశాన్ని విభజించాలని కోరారు. బెంగాల్ విభజనలో ఘోరమైన తప్పిదం జరిగింది.
1947 జులై 18వ తేదీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్ లో ఈస్ట్ బెంగాల్ లో ఏం ఉంటాయో.. వెస్ట్ బెంగాల్ లో ఏం ఉంటాయో చెప్పారు. ఒక ఉద్యోగి విభజన సమయంలో చేసిన తప్పు ఇప్పుడు అనుభవిస్తున్నాం..
బంగ్లాదేశ్ మయన్మార్ పరిణామాలు అలా జరిగి ఉండకపోతే వేరేలా ఉండేవి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.