Tensions rise in Pakistan Punjab: నిన్న పాకిస్తాన్ లో ఒక సంఘటన జరిగింది. అది రాజకీయాలను మలుపుతిప్పే ఘటనగా మారింది. తెహ్రిక్ ఏ లబ్బాయిక్ మతవాద పార్టీని పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. ఈ లబ్బాయిక్ పాకిస్తాన్ పార్టీ అతిపెద్ద మతవాద పార్టీ. పంజాబ్ లో ఇది బలంగా ఉంది. ఖోర్ పాకిస్తాన్ లో ఇది రాజకీయ పార్టీగా 2016లో మారింది. కానీ చాలా తీవ్ర వాద భావాలున్న పార్టీ. మతసహనం లేని పార్టీ.
పాకిస్తాన్ ఎస్టాబ్లిష్ మెంట్ నే ఈ మతవాద పార్టీని పెంచి పోషించింది. ఒకసారి నిషేధించి మళ్లీ బ్యాక్ తీసుకున్నారు. సాద్ రిజ్వీ, అనాజ్ రిజ్వీ అనే ఈ పార్టీకి చెందిన నేతలు ఎక్కడున్నారో తెలియదు. పంజాబ్ ప్రభుత్వం అరెస్ట్ చేసి వీరిని పీఓకేలో దాచారని అంటున్నారు.
ఈ సోదరుల బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి.. ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, 95 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారని అంటున్నారు. పార్టీకి సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మసీదులు, సెమినార్సీలను బ్యాన్ చేశారని సమాచారం. 6వేల మంది కార్యకర్తలను నిర్బంధించారు.
పాకిస్తాన్ పంజాబ్ లో తీవ్ర ఉద్రిక్తత వేలాది మంది నిర్బంధం.. పాక్ లోని పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.