Bigg Boss 9 Telugu New Twist: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) ఎటు వైపు వెళ్తుందో ఆడియన్స్ కి మాత్రమే కాదు, బిగ్ బాస్ టీం కి కూడా అర్థం కావడం లేదు. మొదటి నాలుగు వారాలు మంచి ఆసక్తికరంగానే ఈ రియాలిటీ షో సాగింది. కానీ ఎప్పుడైతే శ్రీజ ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారో అప్పటి నుండి ఈ రియాలిటీ షో పతనం మొదలైంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా ఒకడిగా నిలుస్తాడు అనుకున్న భరణి కూడా ఎలిమినేట్ అవ్వడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి ఈ షో మరింత పడిపోతూ వచ్చింది. ఈ వారం అయితే టాస్కులు ఆడియన్స్ కి తెగ బోర్ కొట్టించేశాయి. మధ్యలో అమర్ దీప్, అర్జున్ లను తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రయత్నం చేశారు, ఇప్పుడు అది కూడా బెడిసికొట్టింది.
ఇప్పుడు బిగ్ బాస్ టీం చివరి అస్త్రం గా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ (శ్రేష్టి వర్మ మినహా) హౌస్ లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. ఆదివారం రోజున భరణి, ఫ్లోరా, మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి హౌస్ లోకి అడుగుపెడుతారట. వీళ్లంతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. అంతే కాదు ఆ వారం మొత్తం వీళ్లంతా హౌస్ లోనే ఉంటారట. వీళ్ళ కోసం మూసివేయబడింది అవుట్ హౌస్ ని మళ్ళీ సిద్ధం చేస్తున్నారట. అయితే సెలబ్రిటీలు అయినటువంటి భరణి, ఫ్లోరా లు ఆదివారం రోజు నామినేషన్స్ చేసి తిరిగి వెళ్ళిపోతారట. ఎందుకంటే సామాన్యుల క్యాటగిరీ లో ఎంట్రీ ఇచ్చిన నలుగురిలో ఇద్దరికీ మాత్రమే అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ టీం నిర్ణయించుకుందట. కేవలం వీళ్ళను మాత్రమే లగ్గేజ్ ని తెచ్చుకోమని చెప్పారట. భరణి, ఫ్లోరా లకు చెప్పలేదట. అందుకే వాళ్ళు హౌస్ లో ఉండే అవకాశాలు చాలా తక్కువ.
అయితే ఆ వారం రోజులు ఈ నలుగురు కంటెస్టెంట్స్ ఏమి చేయబోతున్నారు?, వీళ్లకు మరియు హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ కి మధ్య పోటీ పెట్టబోతున్నారా?, ఈ పోటీ లో అత్యధిక టాస్కులు గెలిచిన టాప్ 2 కంటెస్టెంట్స్ ని హౌస్ లోనే ఉంచి, మిగిలిన వాళ్ళను బయటకు పంపేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇది వినేందుకు చాలా ఆసక్తికరంగా ఉంది,కానీ టాస్కులు ఎలా డిజైన్ చేశారో చూడాలి.