Telangana MLC Elections 2024: పార్టీ గుర్తు లేకుండా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నిక

పార్టీ గుర్తు లేకుండా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 22, 2024 3:56 pm
Follow us on

తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అందరూ ఎన్నికలు అయిపోయాయి ప్రశాంతంగా ఉందామనుకుంటే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

2021లో ఈ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రావు ఇటీవల ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు, గుర్తులు ఉండవు. బలపరిచిన అభ్యర్థులు బరిలో ఉంటారు. 2021లో ఇదే తీన్మార్ మల్లన్న నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ జేఏసీ సారథి అయిన కోదండరాం పోటీచేసి 3వ స్థానంలో నిలిచారు. బీజేపీ ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానంలో, కాంగ్రెస్ రాములు నాయక్ 5వ స్థానంలో నిలిచారు.

కోదండరాం లాంటి ఉద్యమ నేతకు 3వ స్థానం రావడం అందరినీ కలిచివేసింది. బాధ అనిపించింది. కానీ తీన్మార్ మల్లన్న కే నాటి ఎన్నికల్లో బాగా ప్రచారం సాగింది. ఆయన గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికార పార్టీ కావడం.. అంగ అర్థబలంతో గెలిచి తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు. ఒక ఇండిపెండెంట్ గా పోటీచేసి 2వ స్థానంలో రావడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు.

పార్టీ గుర్తు లేకుండా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.