కేఏ సెంగోట్టియన్.. 77 సంవత్సరాల కురువృద్ధుడు.. అన్నాడీఎంకే స్థాపించినవారిలో ఒకరు. ఎంజీఆర్ అనుచరుడు.. జయలలిత అనుచరుడు.. ఈపీఎస్ కేబినెట్ లోనూ మంత్రిగా చేశారు.ఒకే ఒకసారి 1996లో ఓడిపోయాడు. ఆరోజు నుంచి నేటి వరకూ ఓటమి ఎరుగని నాయకుడు.. అక్టోబర్ 31న ఈ పన్నీర్ సెల్వం ఈయనను పార్టీ నుంచి తొలగించారు.
రామలింగతేవర్ జయంతి నాడు ఓపీఎస్, టీటీవీ దినకరన్ ను కలిశాడట.. దీంతో అంత సీనియర్ నేతను అన్నాడీఎంకే నుంచి తొలగించారు. అన్నాడీఎంకే నేతలను అందరినీ కలుపుకొని వెళ్లాలని సెంగోట్టియన్ కోరడమే తప్పు అయ్యింది. తమిళ రాజకీయాల్లో ఇదో పెద్ద కుదుపుగా మారింది.
నిజానికి ఫళని స్వామి కంటే ముందు సెంగోట్టియన్ నే అన్నాడీఎంకే లీడర్ అవుతాడని అనుకున్నారు.ఒక మూమెంట్ లో ఓపీఎస్, ఈపీఎస్, టీవీకే అందరూ కలిసి రావాలనుకున్నప్పుడు సెంగోట్టియన్ బెస్ట్ సరైన నేత అనుకున్నారు. బీజేపీ కూడా అదే అనుకుంది. బీజేపీ సెంగోట్టియన్ ను లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తుందని అనుకున్నారు.
తమిళ రాజకీయాల్లో కుదుపు, విజయ్ పార్టీలో సెంగోట్టియన్ చేరిక.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.