Andhra King Taluka Collections: యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోల్లో ఒకడు రామ్ పోతినేని(Ram Pothineni). చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకొచ్చిన రామ్ పోతినేని ని చూసి, అప్పట్లో ట్రేడ్ పండితులు ఇతను కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఒక హిట్ కొడితే వరుసగా రెండు మూడు డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకోవడం రామ్ కి అలవాటు అయిపోయింది. అందుకే స్టార్ లీగ్ లోకి చేరలేకపోయాడు. ఈమధ్య కాలం లో ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. రామ్ మార్కెట్ బాగా దెబ్బ తినింది. అలాంటి బ్యాడ్ ఫేస్ లో ఉన్న రామ్ నుండి నేడు ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రం విడుదలైంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
రామ్ చాలా కాలం తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు, ఎట్టకేలకు సూపర్ హిట్ సినిమాని అందుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ టాక్ కి తగ్గ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం అటు ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, ఇటు తెలంగాణ లో కానీ రాలేదు. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 3 నుండి 4 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఇది రామ్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గత చిత్రాలకు టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఈ సినిమాకు మాత్రం రామ్ గత చిత్రాల ప్రభావం బలంగా పడింది. ఆయన నుండి సూపర్ హిట్ చిత్రం ఆడియన్స్ అసలు ఆశించడం లేదు.
అందుకే ఓపెనింగ్ వసూళ్లు అన్ని ప్రాంతాల్లో డల్ గా ఉన్నాయి. పైగా జానర్ కూడా కమర్షియల్ కాకపోవడం తో దాని ప్రభావం ఈ సినిమాపై బలంగా పడింది. ఓపెనింగ్ వసూళ్లు ప్[ఎద్దగా ఉండకపోవచ్చు కానీ, వీకెండ్ కి ఈ చిత్రం పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ గత చిత్రం డబుల్ ఇస్మార్ట్ కి మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి, దీన్ని బట్టీ గత చిత్రాల ఫలితాలు రామ్ మార్కెట్ ని ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.