https://oktelugu.com/

Annamalai : అన్నామలై కోయంబత్తూరు ఎన్నికల వాగ్దానాల పత్రం విడుదల

అన్నామలై కోయంబత్తూరు ఎన్నికల వాగ్దానాల పత్రం విడుదల.. కోయంబత్తూరు ఎన్నికపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 13, 2024 4:52 pm

Annamalai : అందరి దృష్టి తమిళనాడులోని కోయంబత్తూరుపైనే ఉంది. కారణం అందరికీ తెలిసిందే.. అన్నామలై పోటీచేయడంతో బీజేపీ నాయకులు.. అన్నామలై వ్యతిరేక కూటములు, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కోయంబత్తూరుకు బారులు తీరుతున్నారు. నిన్ననే డీఎంకే అభ్యర్థి తరుఫున రాహుల్ గాంధీ, స్టాలిన్ లు కోయంబత్తూరులో సభ జరిపారు. దీంతో దేశంలోనే ఇది ప్రతిష్టాత్మక ఎన్నికగా మారింది. ఫోకస్ ఇప్పుడు తమిళనాడుపైనే ఉంది.

ఏప్రిల్ 19న మొదటి దశలోనే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న నారా లోకేష్ సైతం కోయంబత్తూరుకు ప్రచారానికి వచ్చారు. గౌండాస్ తర్వాత కోయంబత్తూరులో అతిపెద్ద కమ్యూనిటీ ‘నాయుడు’లు కావడం గమనార్హం. అందుకే లోకేష్ తరలివచ్చారు. మలయాళీ అసోసియేషన్ వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడారు.

తమిళనాడులో కోయంబత్తూరు సెకండ్ లార్జెస్ట్ సిటీ. చెన్నై తర్వాత కోయంబత్తూరు పెద్ద నగరంగా ఉంది. మిక్సర్, వెడ్ గ్రైండర్ లకు ప్రఖ్యాతి గాంచిన పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంట్ రిత్యా 3వ అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. ఎన్నిక అందరిదృష్టిలో పడిందంటే లీడర్ గా అన్నామలై పోటీచేయడంతోనే ఇది జరిగింది.

అన్నామలై కోయంబత్తూరు ఎన్నికల వాగ్దానాల పత్రం విడుదల.. కోయంబత్తూరు ఎన్నికపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అన్నామలై కోయంబత్తూరు ఎన్నికల వాగ్దానాల పత్రం విడుదల || Tamil Nadu BJP chief K Annamalai's manifesto