UP police appointment letters : యోగి ఆధిత్యనాథ్.. 2017లో అధికారం చేపట్టిన తర్వాత మేజర్ సక్సెస్ స్టోరీ ఏంటి అంటే శాంతిభద్రతలు.. దానికి ముఖ్యంగా ‘పోలీస్ వ్యవస్థ’ ప్రక్షాళన చేశారు. మాఫియా గ్యాంగ్ లతో పోలీసులకు అంతకుముందు లింకులు ఉండడం.. సమాజ్ వాదీ పార్టీ పోలీసులను రాజకీయంగా వాడుకుంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది.
పోలీస్ వ్యవస్థను తిరిగి ప్రొఫెషనల్ వ్యవస్థగా యోగి తీర్చిదిద్దారు. పోలీసులను యూపీలో మంచిగా ఎలా ఉపయోగించాలో చూపించాడు. పోలీసులతో ప్రజలకు శాంతిభద్రతలు, సమస్యలు తీర్చేందుకు వాడుతున్నారు.
నిన్న 60244 మంది పోలీసులకు ఒకే రోజు అపాయింట్ మెంట్ ను యోగి ఆదిత్యనాథ్ అందజేశారు. అమిత్ షా చేతుల మీదుగా సింబాలిక్ గా ఒకే రోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో 12 వేల మంది మహిళలకు పోలీసులుగా అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు. యూపీలో ఇప్పుడు అతిపెద్ద పోలీస్ వ్యవస్థగా మారింది.
ఇవాళ అధునాతన సాంకేతికతలో కూడా యూపీ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా టీచర్లు, పోలీసులకు బాగా ఉద్యోగాలిచ్చారు. దోపిడీలు 85 శాతం తగ్గింది. హత్యలు 45 శాతం తగ్గింది. 8వేల ఎన్ కౌంటర్లు, 2వేల మంది రౌడీలను కాల్చిపారేశాడు. 80వేల మందిని జైల్లో పెట్టారు. 14వేల కోట్ల ప్రాపర్టీలను సీజ్ చేశాడు.
48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.