Revanth Reddy on Vice Presidential election: రేవంత్ రెడ్డి తెలుగు ప్రేమ పెల్లుబుకుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. కేసీఆర్, చంద్రబాబు, పవన్, జగన్ లను జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాడు.
అయితే రేవంత్ రెడ్డి ఈ చర్యలను కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకే పరిమితం చేస్తాడా? మిగతా అన్ని అంశాలకు విస్తరింపచేస్తాడా.? అన్నది చూడాలి. నిజంగా తెలుగు వాళ్ల మీద ప్రేమ ఉంటే ముందు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కావాలి కదా..
అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగువారు కలిసినంత మాత్రానా గెలిచినట్టు కాదు.. ఎటూ ఓడిపోయే అభ్యర్థి ఈ కాంగ్రెస్ క్యాండిడేట్. పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలే ఓటు వేస్తారు. ఇందులో 422 మంది ఎంపీలు ఎన్డీఏకే ఉన్నారు.. కాంగ్రెస్ కు రెండు వందల చిల్లర ఉంటాయి. మెజార్టీకి 30 మంది ఎంపీలు ఎన్డీఏకు ఎక్కువ ఉన్నారు. సో బీజేపీ అభ్యర్థి గెలుపు లాంఛనమే.
రేవంత్ రెడ్డి తెలుగు ప్రేమ ఉప రాష్ట్రపతి ఎన్నికకే పరిమితమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.