Caste Politics : కులం.. కులం.. ఎక్కడ చూసినా ఇదే పదం.. వీడు మనవాడా? అవతలివాడా? సమాజం ఎటుపోతోంది. అంబేద్కర్ కుల రహిత సమాజాన్ని కోరుకున్నారు. సామాజిక అంతరాలు ఉన్నంత కాలం ఈ రిజర్వేషన్లు ఉండాలన్నారు. కులరహిత సమాజం దిశగా అడుగులు పడడం లేదు.
కొత్తతరం కులాన్ని పట్టించుకోవడం లేదు. నగరాల్లో విదేశాల్లోఅసలు కులాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నవతరంలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. మనకు ఇక్కడ రాజకీయ నాయకులే రెచ్చగొడుతున్నారు. రాహుల్ గాంధీ మాత్రం అంబేద్కర్ లా.. కాన్షీరాంలా ఫోజుకొడుతున్నారు. కానీ వాళ్ల కర్ణాటక ప్రభుత్వంలో ఎందుకు అమలు చేయించడం లేదు. కర్ణాటకలో సెన్సెస్ ను బయటపెట్టడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో కులగణనను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చేయడం లేదు.
ఎవరైనా జర్నలిస్ట్ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తే.. అతడి కులాన్ని ప్రశ్నిస్తాడు.. నిర్మలా సీతారామాన్ చుట్టు ఉన్న అధికారుల కులాన్ని ప్రశ్నించిన దౌర్భాగ్యం రాహుల్ గాంధీలో ఉంది. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ లోనూ కులం కనిపించలేదు. అగ్రవర్ణాలకే ప్రాధాన్యతనిచ్చారు.
దేశానికి ఎంతో గొప్ప సేవ చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను విమర్శించిన తీరు చూస్తే ఎవరికైనా రాహుల్ గాంధీని తిట్టాలని అనిపిస్తుంది.
కులగణన ఉచ్చులో పడి సమాజాన్ని మరింత బలహీన పర్చకండి.. కులగణనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.