Kerala BJP : కేరళలో అందరూ ఊహించింది పాలక్కాడ్ ఈసారి బీజేపీకి బంగారు అవకాశం.. గెలిచే అవకాశం ఉందని అనుకున్నారు. గెలవడం సంగతి పక్కనపెడితే ఘోరంగా ఓడిపోయింది. పోయిన సారి 5వేల తేడాతో మెట్రో మ్యాన్ శ్రీధర్ ఓడిపోయాడు. ఈసారి 18700 తేడాతో బీజేపీ క్యాండిడేట్ కృష్ణకుమార్ ఓడిపోయాడు.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసింది. పాలక్కాడ్ లో ఆర్ఎస్ఎస్ కేడర్ బలంగా ఉన్న ప్రాంతం. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు అడ్వంటేజ్ ఉన్నా బీజేపీ ఎందుకు ఓడిపోయింది. దారుణంగా ఎందుకు ఓడింది అని ఆలోచిస్తున్నారు.
ఇది మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఆయన వ్యక్తిగత ఇమేజ్ అని అంటున్నారు.అయితే 2011లో 20 శాతం ఓట్లు వచ్చాయి. 2021లో 35 శాతం చొప్పున బీజేపీ గ్రాఫ్ పెరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుంది.అయినా అక్కడ చిత్తుగా బీజేపీ ఓడిపోయింది.
పాలక్కాడ్ లో బీజేపీ గ్రూపు తగాదాలు తీవ్రమయ్యాయట.. ముఖ్యంగా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కృష్ణ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చిందట..
పాలక్కాడ్ లో ఓటమితో కేరళలో బీజేపీకి భవిష్యత్తు అంధకార బంధురమేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషనను కింది వీడియోలో చూడొచ్చు.
