Syria : రెండు వారాల్లో మధ్య ఆసియా జియో పాలిటిక్స్ మొత్తం మారిపోయాయి. అర్ధ శతాబ్ధపు నియంతృత్వపు పాలనకు చరమగీతం పాడింది. సిరియాను ఎగదోస్తూ ఇరాన్ , రష్యాల ప్రభావం పూర్తిగా నాశనమైంది.
ఇరాన్ తన శత్రుదేశమైన ఇజ్రాయిల్ ను నాశనం చేయడానికి దాని చుట్టుపక్కల దేశాల్లో ఉగ్రవాదులను,ప్రభుత్వాలను పెంచి పోషిస్తోంది. ఇవాళ దానికి పెద్ద బ్రేక్ పడింది. హెచ్ బొల్లా తీవ్రవాదులకు సిరియా నుంచి ఆయుధాలు సరఫరా చేసే లింక్ బంద్ అయిపోయింది. దీనికి ఘనత ఎవరిది? ఎవరు దీన్ని సాధించారు.?
అబు మహ్మద్ జులానీ అనే వ్యక్తి ఇవాళ సిరియాలో అధికారంలోకి రాబోతున్నారు. టర్కీ మద్దతు ఉందంటున్నారు. సిరియాలో అసద్ ప్రభుత్వం తిరుగుబాటుదారులతో పోరాడలేని స్థితికి దిగజారడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్. లెబనాన్ లో హెజ్ బొల్లాను నాశనం చేసింది. గాజాలో హామాస్ ను లేపేసింది. ఇవాళ సిరియా అధ్యక్షుడు అసద్ దేశం నుంచి పారిపోయాడంటే ఇజ్రాయిల్ ఘనతనే.. అసద్ సైన్యం తిరుగుబాటుదారులతో యుద్ధం చేయలేని పరిస్థితులకు దిగజారడంతో ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విదేశాలకు పారిపోయాడు.
సిరియాలో మెజారిటీ మతస్తులు వంద సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాబోతున్నారు. ‘సిరియా’ పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
