Nikhil Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి కేంద్ర హోం షాక మంత్రి అమితషాతో బేటీ అయ్యారు. సోమవారం(డిసెంబర్ 9న) ఢిల్లీ వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రిని కలిశారు. చన్నపట్నం ఉప ఎన్నికల ఫలితాలతోపాటు కర్ణాటక తాజా రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. అనింతరం నిఖిల్ మాట్లాడుతూ అమిత్‌షా తనను కష్టపడి పనిచేయాలని ప్రోత్సహించారని తెలిపారు. రాబోయే జిల్లా, తాలూకా, పంచాయతీ ఎన్నికలపైనా చర్చించామని వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.
బీజేపీ పెద్దలతోనూ భేటీ..
ఇదిలా ఉంటే.. నిఖిల్ కుమారస్వామి అంతకు ముందు బీజేపీ పెద్దలతోనూ భేటీ అయ్యారు. బీఎస్‌సంతోష్, కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ రాధామోహన్‌దాస్ అగర్వాల్‌ను కలిశారు. కర్నాటక ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన పాలనను అందించడం లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామూహిక నిరసనలు నిర్వహించాలని వారు సూచించినట్లు నిఖిల్ వెల్లడించారు.
దేవెగౌడ గురించి…
దేవెగౌడపై ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై నిఖిల్ స్పందిస్తూ.. 60 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒక ఎమ్మెల్యే తమ పదవి గౌరవాన్ని నిలబెట్టే విధంగా మాట్లాడాలి. ఓటమిని వినమ్రంగా అంగీకరించాను. భూ, నీటి సమస్యలపై దేవెగౌడ నిరంతరం పోరాడారన్నారు. ఇప్పుడు కూడా క్రమశిక్షణతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూ యువ ఎంపీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ∙స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి రాజకీయాల నుండి రిటైర్ కావద్దని కోరారు. రాజ్యసభలో ఉంటూ దేశానికి మార్గదర్శకత్వం వహించాలని మోదీ అభ్యర్థించారు. మోడీ విజ్ఞప్తిని అనుసరించి, దేవెగౌడ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
క్రమశిక్షణ గల సైనికుడిని..
పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి మాట్లాడుతూ.. తాను నమ్మకమైన కార్యకర్తను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని. తన పరిమితుల గురించి తనకు తెలుసన్నారు. పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా కిందిస్థాయి కార్యకర్తలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.