Veena Vijayan : మధురైలో సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి.. వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.. మధ్యలో నిన్న ఒక వార్త వైరల్ అయ్యింది. కేరళ ముఖ్యమంత్రి కూతురు పినరయి విజయన్ కూతురు వీణ ఈమె అవినీతి కుంభకోణం చేసిందని.. పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఢిల్లీ హైకోర్టులో చార్జ్ షీట్ నమోదైంది.
ఇది రాజకీయ కుట్ర అని.. మమ్మల్ని తొక్కేసే కుట్ర అని పినరయి విజయన్ వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిమీద మీ వైఖరి ఏంటని సీపీఎం నేత సలీంను మీడియా ప్రశ్నించగా.. ఈ విషయంలో పార్టీ చొరవ తీసుకోదని.. ఆరోపణలు వచ్చిన వారే పోరాడుతారని వ్యాఖ్యానించారు.
అయితే పినరయి విజయన్ పార్టీపై సీపీఎం అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోదని స్పష్టమైంది. 2017 నుంచి వీణ అకౌంట్లో ఓ కంపెనీ నుంచి 3 లక్షల చొప్పున ప్రతీ నెల పడడంతో ఈ అవినీతి కుంభకోణం వెలుగుచూసింది.
అసలు వీణ చేసిన స్కాం ఏంటి? ఏ సంస్థలో ఈ అవినీతి జరిగింది? ఇందులో జరిగిన కుంభకోణం అవినీతిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
