Tirupati Stampede : నిన్న తిరుపతిలో జరిగింది హృదయ విదారకం.. దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం దారుణం. ఇది ఖచ్చితంగా మానవతప్పిదమే.. ఇటువంటివి జరగకుండా మనం నివారించలేమా? తిరుపతిలో జరిగింది తప్పా? ఒప్పా? అని మేం మాట్లాడడం లేదు. ఎందుకంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరిగేదాకా అందరూ ఆగాలి.
కొన్ని విషయాలు చూస్తే.. తిరుమలలో క్రౌండ్ మేనేజ్ మెంట్ చేయడమే పెద్ద టాస్క్. క్రౌడ్ మేనేజ్ మెంట్ అనేది ప్రొఫెషనల్ సబ్జెక్ట్. దీనిమీద చాలా స్టడీ చేయాలి. క్రౌడ్ మేనేజ్ మెంట్ లో జరుగుతున్న తప్పులు ఏమిటీ? ఎలా ఉండాలన్నది ఆలోచించాలి. ఒక స్థాయి వరకే ధర్మ దర్శనం, 300 దర్శనం.. ఆ తర్వాత అందరూ ఒకటే చోట కలుస్తారు.
క్రౌడ్ మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్ సబ్జెక్ట్. దర్శనం కోసం వేచి ఉన్నచోట టాయిలెట్స్, సౌకర్యాలు లేవు. ఎప్పుడో కట్టిన టాయిలెట్స్.. టీటీడీ దీని మీద కూడా దృష్టి సారించాలి. అధికారులు చెప్పింది విని అలాగే వదిలేయకూడదు. పర్సనల్ గా మానిటర్ చేయాలి.
ఇటువంటి మానవ తప్పిదాల్ని నివారించటానికి మార్గాలు లేవా? అన్న వాటిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.