Maha Kumbh Mela 2025 : మరో మూడు రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ జరుగబోతోంది. మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడని పండుగ. 144 సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కుంభమేళ.. అర్త కుంభమేళ.. కుంభ మేళ, మహా కుంభమేళ. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. ప్రయాగ్ రాజ్ నగరానికి కొత్త సొబగులు సంతరించాయి.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక అధికారులతో కలిసి, ఇక్కడ గుమిగూడే లక్షలాది మంది సాధువులు, భక్తుల బస, భద్రత , వైద్య అత్యవసర పరిస్థితులకు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల మంది వస్తారని అంచనా. అందువల్ల వారి బసకు ఏర్పాట్లు కూడా ఈ ప్రాతిపదికన పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
మహా కుంభమేళాలో బస చేయడానికి అనేక ఏర్పాట్లు
వీటిలో మొదటిది ది అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్ (TUTC), ఇది సంగం సమీపంలో ఏర్పాటు చేయబడింది. ఈ క్యాంప్‌సైట్‌లో 44 విలాసవంతమైన టెంట్లు ఉన్నాయి. వీటిలో ఇద్దరు వ్యక్తులు బస చేయడానికి రోజుకు లక్ష రూపాయలు అద్దె. ఇది బట్లర్ నుండి రూమ్ హీటర్, వాష్‌రూమ్, గీజర్ మొదలైన అనేక సౌకర్యాలను కలిగి ఉంది. వాటి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3 తేదీలకు, ఈ టెంట్లలో చాలా వరకు ఇప్పటికే బుక్ చేయబడ్డాయి. ఈ రోజుల్లో రాజ స్నానాలు జరుగుతాయి.
2 లక్షల కోట్ల వ్యాపారం జరిగే 45 రోజుల మహా కుంభమేళా పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు
