Nara Lokesh as Deputy CM : ఇటీవల కడప జిల్లా మైదకూరులో నిర్వహించిన చంద్రబాబు సమావేశం సంచలనాత్మకంగా మారింది. స్వచ్ఛంద్ర పేరిట నిర్వహించిన ఈ సభలో కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేయడం సంచలనమైంది. స్వయంగా చంద్రబాబు ముందే ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఇదే స్వరాగాన్ని అందుకొని టీడీపీ శ్రేణులంతా ప్రచారాన్ని చేస్తున్నారు. ఒక్కో నేత గళం విప్పుతున్నారు.
చక్కగా నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి మంచి ఇమేజ్ వస్తోంది. గ్రౌండ్ లెవల్ లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయి.. పోలవరం స్ట్రాట్ అయ్యింది.. విశాఖ ఉక్కుకు ప్యాకేజీ వచ్చిన వేళ అన్ని సానుకూల పవనాలు వస్తున్న వేళ ఈ కొత్త డిమాండ్ ఎందుకు వచ్చింది?
లోకేష్ కు ఏమైనా ప్రాముఖ్యత తగ్గిందా? అంటే సీఎం కొడుకు.. పార్టీ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీలో పాలనలో లోకేష్ కు ప్రాముఖ్యత ఉంది. అటువంటి అప్పుడు ఆరునెలలు గడవకముందే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఎందుకు తెచ్చారు. దీన్నే వైసీపీ అందిపుచ్చుకుంటోంది..
టీడీపీలో ఉన్న లాబీ చంద్రబాబు సీఎంగా.. పవన్ డిప్యూటీ సీఎంగా ఇద్దరే ఉండడాన్ని జీర్ణించుకోవడం లేదా? లోకేష్ కు ప్రాధాన్యత తగ్గిందని బాధపడుతోందా? సాఫీ గా సాగుతున్న వేళ కొన్ని కలుపు మొక్కలు ఈ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ లాంటి వారు దీన్ని మొదట మొదలుపెట్టారు. ఏబీఎన్ ఆర్కేను ముందుపెట్టి మాట్లాడిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ దన్నుగా చంద్రబాబు సాగిస్తున్న పాలనకు కొత్త సరాగాలెందుకు? లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.