https://oktelugu.com/

E TV Prabhakar : ఎవడైతే నాకేంటి.. మోహన్ బాబుపై ఈటీవీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు.. కారణం ఇదే..

నా కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చిన్నోడైనా, పెద్దోడైనా సహించేది లేదని, ఆ సమయంలో మోహన్ బాబును సైతం తిట్టానని బ్యాలెట్లను ఎత్తుకెళ్లే స్థాయికి మోహన్ బాబు దిగజారారని ఈటీవీ ప్రభాకర్ సంచలన విషయాలను బయటపెట్టారు...

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2024 / 07:42 PM IST

    E TV Prabhakar-Mohanbabu

    Follow us on

    E TV Prabhakar: బెల్లితెర నుంచి వెండితెరకు వెళ్లే నటులు కొందరు ఉంటే.. నేరుగా వెళ్లేవారు మరికొందరు ఉంటారు. నటనా రంగంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లిన వారిలో ప్రభాకర్ ఒకరు. మొదట బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రభాకర్ సీరియల్స్ లో మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా ఆయనకు ఎక్కువగా ఫీమేల్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే బుల్లితెరను ఎక్కువగా వీక్షించేది, అందులో సీరియల్స్ అంటే చెవి కన్నూ కూడా కోసుకునేది మహిళలే కదా.. తెలుగు బుల్లితెరపై దశాబ్ధాలుగా వినోదం పంచిన వారిలో మొదటి వరుసలో ఉంటారు ప్రభాకర్. ఏళ్లుగా సూపర్‌హిట్ సీరియల్స్‌, సినిమాల్లో నటిస్తూ గుర్తింపు, గౌరవం సంపాదించుకున్నారు. నటుడిగా జీవితాన్ని ఇచ్చిన ఈ టీవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు ఆయన అందుకే ఆయనను ఎక్కువగా ఈటీవీ ప్రభాకర్ అని పిలుస్తారు. ప్రభాకర్ అంటే ఎక్కువ మంది గుర్తు పట్టకపోవచ్చు. ఆయన జీవితంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు గుణపాఠంగా మిగిలాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఎన్నికలకు సంబంధించి ఒక అరుదైన ఘటనను గుర్తుచేసుకున్నారు ప్రభాకర్.

    బుల్లితెర మెగాస్టార్ అని ప్రభాకర్ ను అందరూ పిలుచుకుంటారు. ఈ టీవీ నడక ప్రారంభించిన కొత్తలో రామోజీరావు కుమారుడు సుమన్, ప్రభాకర్ క్లోజ్‌ ఫ్రెండ్స్. రామోజీ రావు మాట కంటే కూడా ప్రభాకర్ మాట అంటేనే ఎక్కువ గౌరవించే వారు. ఈ టీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం పెరిగిందని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో రామోజీరావు ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని.. అందుకే ఈటీవీ నుంచి ప్రభాకర్ ను తప్పించారని ఇప్పటికీ కథకథలుగా చెప్తుంటారు.

    ఈటీవీ నుంచి తప్పుకున్నా.. జెమినీ, జీ, మాటీవీ వంటి సంస్థల్లో ప్రభాకర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తన కొడుకు చంద్రహాస్‌ను సైతం హీరోగా పరిచయం చేశారు కూడా. ఎలాగైనా కొడుకుకు మంచి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్-మలైజా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సొంతంగా బ్యానర్ పెట్టి ‘రామ్ నగర్ బన్నీ’ అనే సినిమా రిలీజ్ చేశారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

    దేవర రిలీజ్ సమయంలోనే ఈ మూవీ కూడా రావడంతో డిజాస్టర్ అయ్యిందని ప్రభాకర్ భావించాడు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఘోరంగా మా ఎన్నికలు జరిగాయని, తన కళ్ల ముందే బ్యాలెట్లు తీసుకెళ్లిపోయారని చెప్పారు. ఆ సమయంలో మోహన్ బాబు మాట్లాడిన బూతులకు అక్కడున్న వారు చెవులు మూసుకున్నారని నాకు మాత్రం మండిపోయిందని.. తప్పు చేస్తే ఎవరైనా, ఎంతటి వారైనా.. ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు.

    గొడవలు జరగకుండా మంచు మనోజ్ చూస్తుంటే విష్ణు మాత్రం ఒక మోనార్క్ గా వ్యవహరిస్తుంటాడని ప్రభాకర్ ఆరోపించారు. బుల్లితెర ఇండస్ట్రీలో జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేసిన నేను వెండితెరపై కూడా ఏదైనా చేస్తానని నమ్మకంతో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తనను కలిసిందని చెప్పారు. ఈసీలో ఐదుగురితో పాటు మొత్తం 12 మందిమి గెలిచామని ప్రభాకర్ అన్నారు.