Pahalgam terror attack : కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన చూసి యావత్ దేశం దిగ్బ్రాంతికి గురైంది. పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు బలయ్యారు. వారిని మతం అడిగి మరీ చంపారు. హిందూయేతరులను ఏరి మరీ చంపిన దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది.
2023లో హమాస్ దురాగతం.. ఇవ్వాళ నిరాయుధ ప్రాణాలు, అందులో విదేశీయులు కూడా ఉండడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ ఉగ్రముఠా ఈ దాడులు చేసిందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.
ఉగ్రవాదుల లక్ష్యం ఏంటని ఆలోచిస్తే.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చినప్పుడు ఉగ్రవాద దాడులు చేయడం చూస్తే టాపిక్ ను మొత్తం కశ్మీర్ సమస్యపై మళ్లించడం.. సౌదీలో మోడీకి ఇచ్చిన రాయల్ సెల్యూట్ ఘనత భరించలేక.. అసలు లక్ష్యం గజ్వేల్ హిందూలో భాగంగా చేశారా? కశ్మీర్ లో యాత్రికులు రావడం చూసి అది భరించలేక ప్రతిస్పందించారా? జనంలో అన్ పాపులర్ అయిన పాకిస్తాన్ మిలటరీ.. దేశం మొత్తం ఒక్కటి చేయడానికి పన్నిన పన్నాగమా? ఉగ్రవాదులు ఈ దాడి ఎందుకు చేశారన్నది వేచిచూడాల్సిందే..
ఎప్పుడూ జరగనంతగా.. కశ్మీర్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకంగా బంద్ కు పిలుపునిచ్చాయి ఆ పార్టీలు. హురియాత్, ఉమాయత్ ఫరూక్ లాంటి వ్యక్తులు కూడా బంద్ కు పిలుపునిచ్చారు. కశ్మీర్ లు ఇప్పుడు భారత్ తో మమేకమయ్యారు.
కాశ్మీర్ ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా ఒక్కటైన యావత్ ప్రపంచంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
