Waqf Amendment Bill : కేరళ రాజకీయాలు గమ్మత్తుగా మారుతున్నాయి. మునంబం ఓ చిన్న సంఘటన కేరళ రాజకీయాలను మలుపు తిప్పబోతోందా? చూస్తుంటే పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. మునంబం అనేది కొచ్చిన్ కు దగ్గరలో ఉన్న ద్వీపం.. అక్కడ 400 ఎకరాల భూమిని రైతులు కొన్నారు. కేరళ వక్ఫ్ బోర్డు 400 ఎకరాలు మాది అని డిక్లేర్ చేసుకుంది. వాళ్లు డిక్లేర్ చేసుకుంటే కోర్టులు కూడా వారిని క్వశ్చన్ చేయడానికి లేదు. కాంగ్రెస్ పుణ్యమాని వచ్చిన చట్టం ఇదీ..
పోయిన సారి కేరళ ఉప ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఓ నాటకమాడింది. కమిషన్ వేసి న్యాయం చేస్తామని క్రైస్తవులకు మాట ఇచ్చింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూడా ఇలానే చెప్పి మోసం చేశాయి.
వక్ఫ్ బోర్డు డిక్లరేషన్ పై ప్రభుత్వాలకు హక్కు లేదని.. ట్రిబ్యునల్ కు మాత్రమే అధికారం ఉంటుందని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి.
పూర్వ వక్ఫ్ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరగదు. ఇందులో 80 శాతం క్రిస్టియన్లు.. 20 శాతం హిందువులు.. మేం కొన్నాక కూడా వక్ఫ్ చట్టం ఏంటని.. క్రిస్టియన్ రైతులు పోరాడుతున్నారు. హైకోర్టు తీర్పుతో మళ్లీ మొదటకు వచ్చింది.
మునంబం భూ వివాదం కేరళ బీజేపీకి వరంగా మారింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
