https://oktelugu.com/

Mamata Banerjee : దేశ వ్యాప్త నిరసనలతో ఏకాకిగా మారిన మమతా బెనర్జీ

దేశవ్యాప్త నిరసనలతో ఏకాకిగా మారిన మమతా బెనర్జీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 12:12 pm

    Mamata Banerjee : మమతా బెనర్జీ రాజకీయాల్లో ఓ పెద్ద సంచలనం.. 2011కి ముందు అప్పటి బెంగాల్ వామపక్ష ప్రభుత్వంపై గళమెత్తి పోరాడి వారిని గద్దెదించారు. ఆరోజు ఆవిడ మీద నమ్మకంతో తిరుగుబాటు చేసి 2011లో కమ్యూనిస్టులను ఓడించి మమతా బెనర్జీకి పట్టం కట్టారు. ప్రజలు అతి త్వరలో గ్రహించింది ఏంటంటే.. పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టుగా మారిందని గ్రహిస్తున్నారు. దేనికైనా పాపం పండాలి..

    నిన్న లోక్ సభ ఎన్నికల్లో తిరిగి 29 ఎంపీ సీట్లు గెలచుకుందో అహం పెరిగింది. ఏం చేసినా జనం నమ్ముతారని గర్వంతో ఉన్నారు. మమతా బెనర్జీ రాజకీయ క్రీడను ఆపింది కోల్ కతా ఆస్పత్రిలో డాక్టర్ పై హత్యాచారం మమతను ఉక్కిరి బిక్కిరి చేసింది. మమతా బెనర్జీ హయాంలో ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయి.. అయినా బీజేపీ నేతలు మమతపై పోరాటం చేయడంలో విఫలం కావడం.. మమతను ఎదురించి నిలవలేమని భయపడి ప్రజలు ఈసారికి గెలిపించారు. అయితే డాక్టర్ హత్యాచారం మాత్రం మమత పీఠాన్ని కదిలిస్తోంది.

    డాక్టర్ హత్యాచారం ఘటనను మమతా బెనర్జీ ప్రభుత్వం కవర్ చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. తల్లిదండ్రులకు కనీసం చూపించలేదు. దహన సంస్కారాలను తల్లిదండ్రులకు చూపించకుండా వారు వచ్చేలోగా చేసేశారు. బూడిద తీసుకెళ్లి నదిలో కలిపేశారు. మర్డర్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

    దేశవ్యాప్త నిరసనలతో ఏకాకిగా మారిన మమతా బెనర్జీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    దేశ వ్యాప్త నిరసనలతో ఏకాకిగా మారిన మమతా బెనర్జీ | Kolkata doctor case | Mamata Banerjee | Ram Talk