Madvi Hidma: హిడ్మా అనే నక్సలైట్ చనిపోతే ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చనిపోయినట్టు కీర్తిస్తున్నారు. అతడి గురించి గొప్పగా రాస్తున్నారు. ఎవరు ఇతను అంటే.. వందలాది మంది పోలీసులు, భారత సైనికులను కిరాతకంగా చంపిన నర హంతకుడు. కాంగ్రెస్ పార్టీలోని మొత్తం నాయకుల గుంపును చంపిన చరిత్ర ఈ హిడ్మాది. ఏపీలో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబును సైతం బాంబు దాడితో చంపాలని చూశారు.ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.
వీళ్లు.. వీళ్లకు విపరీతమైన సానుభూతి. వీరిని ఉగ్రవాదులు అనడం లేదు. గౌరవంగా మావోయిస్టులు, నక్సలైట్లు అని పిలుస్తున్నారు. హిడ్మా ఉగ్రవాది కాకుంటే.. ఒసామా బిన్ లాడెన్ కూడా ఉగ్రవాది కాదు. ఇద్దరు తమ సిద్ధాంతం కోసం పనిచేశారు. ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోకుండా పోరాడిన వారే.
ఆదివాసీల్లో జనతన సర్కార్ అని రాజ్యాలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేసుకొని పోరాడారు. ఒక ఇస్లామిక్ కానివారిని చంపారు. మరొకరు తమ పోరాటానికి శత్రువులైన వారిని చంపారు. ఆయన అంత్యక్రియలకు విపరీతంగా వచ్చారు జనం అని కీర్తిస్తున్నారు.
ఎందుకు మావో వాదుల్ని తెలుగు మీడియా మేధావులు గౌరవిస్తున్నారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూస్తున్నారు
