Tirumala Tirupati Devasthanam తిరుమల తిరుపతి దేవస్థానం.. హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం. హిందువులు జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్లి ఉంటారు. అంతటి పవిత్రమైన తిరుమల తిరుపతి యాజమాన్యం ఎలా ఉండేది. మొదటి నుంచి రాజులు దీన్ని పెంచి పోషిస్తూ ఉండేవారు. వాళ్లే నిధులు సమకూర్చేవారు.
విజయనగర సామ్రాజ్యం అత్యంత ఫోకస్ చేసి కృష్ణదేవరాయలు ప్రాధాన్యతనిచ్చారు. ముస్లిం పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. చత్రపతి శివాజీ పాలనలో ఈ ఆలయాన్ని పునరుద్దరించి సహకారం అందించారు. ఆ తర్వాత చివరకు ఆర్కాట్ నవాబు కింద ఉన్నప్పుడు బ్రిటీష్ వారికి కప్పం చెల్లించలేక బ్రిటీష్ వారికి తిరుమల ఆదాయాన్ని తనఖా పెట్టాడు.
నవాబుల కాలం ముగిశాక.. 1801లో ఈ ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకు వెళ్లింది.విజయనగర కాలంలో వెలుగువెలిగిన ఆలయం.. బ్రిటీష్ వారి హయాంలో 1840లో ఈ ఆలయ బాగోగులు చూసుకోవాలని హాథీరాంజీ మఠంకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 1933 వరకూ హాథీరాంజీ మఠం కిందనే తిరుమల వ్యవహారాలు ఉండేవి. 1927లో బ్రిటీష్ వారు టీటీడీ యాక్ట్ అన్నది తీసుకొచ్చారు. 1933లో గొడవల తర్వాత మద్రాస్ ప్రభుత్వం కిందకు వెళ్లింది.
1951లో స్వాతంత్ర్యం తర్వాత తమిళనాడు దేవాలయాలు, తిరుమల దేవాలయాల కోసం ‘ఎండోమెంట్ యాక్ట్’ తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీ ఏర్పడ్డాక 1966లో కొత్త చట్టం చేసింది.1987లో తీసుకొచ్చిన చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్య చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.