Jitendra Singh : జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై దేశమే కాదు.. ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసలు ఎలా జరుగబోతున్నాయి. స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయా? ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందా? అన్నది ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు మొత్తం 5 దఫాల్లో జరుగుతాయి.. మొదటి ఎన్నిక ఉద్దంపూర్ లో జరుగబోతోంది. ఆ తర్వాత జమ్మూ, తర్వాత అనంతనాగ్, రాజోళి, శ్రీనగర్, బారాముల్ల ఇలా ఐదు దఫాల్లో ఒక్కోటి ఎన్నిక జరుగనుంది.
ఉద్దంపూర్ లోక్ సభ 5 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ఐదు జిల్లాల్లో కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలున్నాయి. హిందువులు, ముస్లింలు కలిసిపోయి ఉన్నారు. హిందువులు మెజార్టీ ఉన్నారు.
అభ్యర్థులు ఎవరని చూసుకుంటే.. బీజేపీ తరుఫున డాక్టర్ జితేందర్ సింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి. పీఎంవో ఆఫీసులోనే ఉంటాడు. కాశ్మీరీ ఈయన.. చౌదరి లాల్ సింగ్ కాంగ్రెస్ తరుఫున పోటీచేస్తున్నారు. మూడో వ్యక్తి గులాంనబీ ఆజాద్ పార్టీ తరుఫున జీఎం సరూరీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ముగ్గురు ఉద్దండుల మధ్య పోటీ నెలకొంది.
ఉద్దంపూర్ లో హ్యాట్రిక్ కొట్టబోతున్న జితేంద్ర సింగ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.