Agent Movie In OTT : ప్రస్తుతం అనేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు లెక్క లేనన్ని సినిమాలో ఓటీటీలోకి వస్తున్నాయి. మామూలుగా ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒక వేళ థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓటీటీలో స్ట్రీమింగ్ కు కనీసం రెండు నెలల టైం తీసుకుంటున్నారు మేకర్స్. వారికి ఓటీటీ స్ట్రీమింగ్ అస్సలు ఇష్టం లేకపోతే 80డేస్ పాలసీని ఫాలో అవుతారు. కానీ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం ఓ రికార్డు. అక్కినేని అఖిల్ నటించిన సినిమా ఆ రికార్డ్ క్రియేట్ చేసింది. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది.
Also Read: దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రమే ఏజెంట్. ఈ మూవీ 2023ఏప్రిల్ నెలలో థియేటర్లో విడుదల అయ్యింది. ఈ సినిమాను అఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. అందుకే ఈ మూవీకి భారీగా ప్రమోషన్లు కూడా చేశారు. అఖిల్ కూడా తన గత చిత్రాలకు చేయనంత ప్రమోషన్లు చేశాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ మూవీ టీం అంతా ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ థియేటర్లలో రిలీజై ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో చాలామంది ప్రేక్షకులు రెండో రోజు నుంచే ఈ సినిమా కోసం థియేటర్లలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. మొత్తానికి ఓ సినిమా డిజాస్టర్ అయింది.
అసలు ఏజెంట్ సినిమా ఎందుకు డిజాస్టర్ అయిందో తెలుసుకునేందుకు చాలా మంది ప్రేక్షకులు దీనిని ఓటీటీలో చూడాలని ఫిక్స్ అయ్యారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తునే ఉన్నారు. 2024లో కూడా ‘ఏజెంట్’సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఫైనల్‌గా సోనీ లివ్‌లో ‘ఏజెంట్’ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసి అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఏజెంట్ తెరకెక్కింది. ఇందులో అక్కినేని అఖిల్, మమ్ముట్టి కూడా నటించారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఈ సినిమాలో నటించడంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ విడుదలయిన తర్వాత సినిమాలో యాక్షన్ సీన్లు ఉన్నా అసలు ఈ సీన్లు ఎందుకు వస్తాయో సంబంధం లేకుండా ఉందని చూసిన వాళ్లు చెప్పారు. అందుకే సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
Also Read : పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ రివ్యూ: పెళ్లి కోసం తపించే యువకుడి వ్యధ, సప్తగిరికి బ్రేక్ వచ్చేనా?