AP vs Telangana: ఈరోజు మనం ఆంధ్ర, తెలంగాణ పాలనలు ఎలో ఉన్నాయో చూద్దాం.. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తయ్యాయి. తెలంగాణలో 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో చెరో దఫా సీఎం అయ్యారు. తెలంగాణ పాలనలో స్టెబులిటీ ఉండగా.. ఆంధ్రాలో అధికారం మారుతూ వచ్చింది.
ఎవరి పాలనలో ఎలా ఉందని చూస్తే.. అప్పుడు ఆంధ్రా ముందుంటే ఇప్పుడు తెలంగాణ ముందుకొచ్చింది. ఇది అంత పెద్ద తేడా కాదు. విభజన తర్వాత టెస్ట్ చేసుకోవడానికి ఇది ఆస్కారం. 11 ఏళ్ల తర్వాత కూడా ఒకే జీడీపీ ఉంది. ఆర్థిక స్థితి చూస్తే.. విడిపోయినప్పుడు తెలంగాణ మిగులులో ఉండగా.. ఇప్పుడు అప్పుల్లో ఉంది. ఆంధ్రా అప్పటి నుంచి ఇప్పటివరకూ అప్పుల్లోనే ఉంది. సంక్షేమం పేరుతో జగన్ అభివృద్ధిని పడకేశారు.
తెలంగాణ పాలన చూస్తే.. రేవంత్ ప్రధాన ఫోకస్ ‘సోషల్ జస్టిస్’ మీద ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికలు నిర్వహంచడం లేదు. బీసీ రిజర్వేషన్లు తెచ్చి జాప్యం చేస్తున్నారు. తెలంగాణకు వనరులు, హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా ఉపయోగించుకోవడం లేదు. రేవంత్ ముఖ్యంగా సోనియా, రాహుల్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు తప్పితే తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.
ఆర్థిక ప్రగతిలో ఆంధ్ర తెలంగాణలు ఎలా ముందుకెళ్తున్నాయి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.