Vijay Election Campaign: ఈరోజు టీవీకే అధినేత , తమిళ హీరో విజయ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. ఉదయం 10.35కి తిరుచనాపల్లిలో జరిగే సభతోని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాడు. కాకపోతే ఇదొకటి వినూత్నంగా ఉంది. ఈ సభకు 23 కఠిన నిబంధనలను పోలీసులు విధించారు.
ప్రసంగం 25 నిమిషాల్లో ముగించాలి. 11 లోపు ముగించాలి. ఎటువంటి ప్రచారాన్ని, ర్యాలీని, రోడ్ షోలను చేయరాదు. కేవలం ఆయన వెహికిల్ తోపాటు 5 వెహికల్స్ కు అనుమతించారు. పాదయాత్ర చేయడానికి లేదు. డ్రికింగ్ వాటర్, ఫైర్ ఎక్విప్ మెంట్, గర్భిణి స్త్రీలు, మహిళలు, పిల్లలు రావడానికి లేదు. ఇలా మొత్తం 23 నిబంధనలను పోలీసులు విధించారు.
విజయ్ అభిప్రాయాలు నచ్చినా.. నచ్చకపోయినా.. ప్రజల వద్దకు వెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల డీఎంకే ప్రభుత్వమే విజయ్ కు సానుభూతి తెస్తోంది. ప్రభుత్వం నిర్బంధంతో విజయ్ కు క్రేజ్ రావడం ఖాయం.
23 కఠిన పోలీసు నిబంధనలతో హీరో విజయ్ ఎన్నికల ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.