Gorakhpur Link Expressway : నిన్న యూపీలో సీఎం యోగి ఆధిత్యనాథ్ మరో ఎక్స్ ప్రెస్ వేను ఓపెన్ చేశాడు.గోరక్ పూర్ లింక్ ఎక్స్ ప్రెస్ వేను ఓపెన్ చేశాడు.పూర్వంచల్ నుంచి గోరక్ పూర్ కు కొత్తగా ఒక లింక్ ఎక్స్ ప్రెస్ వేను ఓపెన్ చేశారు.
యూపీ అంటేనే బీమారు రాష్ట్రంగా పేరొందింది. సోషల్ పేరామీటర్స్ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దిగువన ఉండడం… అందులోనూ తూర్పు ఉత్తర ప్రదేశ్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. బీహార్ కు పక్కనే ఉన్న ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందింది.
ఇన్నాళ్లుగా ఉన్న వెనుకబాటును తొలగించడానికి యోగి ఆధిత్యనాథ్ కృషిచేస్తున్నాడు. ఎక్స్ ప్రెస్ వేలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికే యూపీలో 7 ఎక్స్ ప్రెస్ వేలు ఉన్నాయి. మౌళిక సదుపాయాలు భారీగా మెరుగయ్యాయి.
లక్నో నుంచి గోరఖ్ పూర్ కు మూడున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు. దీంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 4 ఇండస్ట్రీలు వస్తున్నాయి.కారిడార్ లు వస్తున్నాయి.
వెనుకబడిన తూర్పు ఉత్తరప్రదేశ్ లో మరో ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
