UK Politics : బ్రిటన్ లో జరిగింది వింటే దారుణాతి దారుణంగా ఉంది. అసలు నిజాలు బయటకు రావడంతో ప్రపంచమే షాక్ కు గురి అవుతోంది. దాదాపు 3 దశాబ్ధాల నుంచి చిన్న పిల్లలను సామూహిక మానభంగాలను కొన్ని గ్యాంగులు చేస్తున్నాయి. గూమింగ్ గ్యాంగ్స్ అంటారు. వల వేస్తారు.. పట్టుకుంటారు.. బలవంతంగా తీసుకెళతారు. సామూహిక అత్యాచారం చేస్తారు.
ఏదైనా ఒకటి ప్రతీదేశంలో జరుగుతాయి. కానీ ఆర్గనైజర్ గా.. కొన్ని గ్యాంగులు ఈ పనిచేయడం అన్నది ఎక్కడైనా విన్నమా.? కానీ ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఇంగ్లండ్ దేశంలో ఇది జరగడం అందరినీ నివ్వెరపరుస్తోంది.అదీ ప్రధానంగా వాళ్ల తెల్లవాళ్ల పిల్లలనే టార్గెట్ చేయడం.. 11-15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై సామూహిక అత్యాచారాలు దారుణాతి దారుణంగా ఉన్నాయి.
కొన్ని గ్యాంగులు.. అంతా ఒక దేశానికి సంబంధించిన వాళ్లు.. పాకిస్తానీయులు కావడం గమనార్హం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని మీర్ పూర్ నుంచి వెళ్లిన వారే ఈ దారుణాలు చేస్తున్నారు. బయటకొచ్చినవి చాలా తక్కువ. లక్షన్నర మంది తెల్లవాళ్ల బాలికలు అత్యాచారానికి గురయ్యారని పార్లమెంట్ లోనే ఒక ఎంపీ బయటపెట్టడం గమనార్హం.
పాకిస్తానీ మూకల దారుణాల్ని కప్పిపుచ్చాలని చూస్తున్న ఇంగ్లాండ్ ప్రధాని.. అక్కడి పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
