Donald Trump : జనవరి 20వ తేదీ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఆలోపలే ట్రంప్ ఎన్నో వివాదాలు రాజేస్తూ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలాగా చేస్తున్నాడు. రెండు వారాల టైం ఉన్నా తగ్గడం లేదు. గ్రీన్ లాండ్ ను కలుపుకుంటామని.. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామని.. పనామా కాలువ మాకు కావాలంటూ దేశాలకు దేశాలనే కబళించే పనిలో పడ్డాడు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చి కలిసినప్పుడు ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా కలుపాలని అనడాన్ని అందరూ కామెడీగా చూశారు. గ్రీన్ ల్యాండ్ ను కావాలని ట్రంప్ హయాంలోనే ట్రై చేశారు.
ఇక పనామా కాలువ అనేది చారిత్రకంగా అది అమెరికాదే.. 1977లో జిమ్మి కార్టన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాన్ని పనామాకు రాసి ఇచ్చారు. రుజ్ వెల్డ్ కాలంలో జరిగింది. పనామా కాలువ అమెరికాకు కీలకంగా భావిస్తున్నారు.
స్పెయిన్, పోర్చుగల్ దేశాలు ప్రపంచాన్ని జయించి అన్ని దేశాలను ఆక్రమించి పాలించారు. తర్వాత ఇంగ్లండ్, ఫ్రాన్స్,జర్మన్ లు వలసలు ఏర్పాటు చేసుకొని ప్రపంచ దేశాలన్నింటిపై పడి దోచుకుతిన్నాయి.
పనామా కాలువ.., కెనడా గ్రీన్ ల్యాండ్ లను అమెరికాలో కలపాలట.. ట్రంప్ చర్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలోచూడొచ్చు.