Balochistan : బెలూచీల పోరాటం రోజురోజుకు ఉధృతం అవుతోంది. పాకిస్తాన్ సైన్యం వారిని ఎంత అణచివేయాలనిచూసినా.. కూడా వారి పోరాటం పెరుగుతూనే ఉంది. దీనికికారణం ఏంటి? ఎందుకు వారు బలంగా పోరాడుతున్నారు.
అంత పెద్ద సైనిక శక్తి అయిన పాక్ తో వారు ఎందుకు పోరాడుతున్నారు. వారికి అన్యాయం అనాదిగా జరుగుతోంది. బెలూచీలు తాము పాకిస్తానీలం కాదు.. తమకు ప్రత్యేక దేశం కావాలని ఎందుకు బల్లగుద్ది చెబుతున్నారు? చరిత్రలో బెలూచీలకు జరిగిన అన్యాయమే వారిని నిద్రపోనీయకుండా చేస్తోంది.
బెలూచీలది పెద్ద సంస్థానం.. ఇరాన్ లోని సిస్థాన్ ప్రావిన్స్ తోపాటు అప్ఘన్, సింధూలోని కొంత భాగంతో ‘బెలూచీల’ సంస్థానం ఉండేది. అయితే ఇరాన్, అప్ఘన్, పాక్ లకు కొంత ప్రాంతాలను బ్రిటీష్ వారు విడగొట్టి వేరు చేశారు. ఇప్పుడు పాక్ లో మిగిలిందే ‘బెలూచీల’ ప్రాంతం.
చరిత్రలో బెలూచీలకి జరిగిన అన్యాయమేంటో తెలుసా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..