Dinamalar Survey : తమిళనాట ప్రఖ్యాత దినమలర్ పత్రిక ఓ ఓపినియన్ పోల్ ను నిర్వహించింది. అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ రిలీజ్ చేసింది. వరుసగా మూడు రోజులు సిరీస్ గా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ విడుదల చేసింది.
ఇది చేసినటువంటి వ్యక్తి జేవీసీ శ్రీరామ్. ఈయన చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కరెక్ట్ గా అంచనావేసి బీజేపీ గెలుస్తుందని చెప్పాడు. బీజేపీ గెలుస్తుందన్నాడు.. గెలిచింది. సెఫాలజీలో నిపుణుడుగా జేవీసీ శ్రీరామ్ పేరుగాంచాడు.
జేవీసీ శ్రీరామ్ ట్రాక్ రికార్డ్ బాగుంది. శాంపిల్స్ ను తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఓటర్ల మనోగతం తెలుసుకున్నాడు. దీన్ని కొట్టిపారేయలేని విధంగా ఉంది. ఉన్నదాంట్లో మెరుగైన సర్వేగా పేరుగాంచింది. మొత్తం చూసుకుంటే ఆయన ఇచ్చిన సర్వేలో ఇప్పుడున్న ఇండీ కూటమినే ఇప్పుడు డీఎంకే కూటమి 39 సీట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకేకు 34 సీట్లు.. 20 శాతం ఓట్లు.. ఎన్డీఏ కూటమికి 39 సీట్లు.. 25.36 ఓట్ల శాతం వస్తుందని నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని అన్నది డీటెయిల్డ్ గా ఇచ్చారు.
దినమలర్ సర్వే ప్రకారం NDA గ్యారంటీగా గెలిచే సీట్లు ఎన్ని అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.