https://oktelugu.com/

BJP : లోక్ సభలో 400 దాటితే రాజ్యాంగాన్ని మార్చవచ్చా?

400 సీట్లకు.. రాజ్యాంగాన్ని మార్చడానికి ఏమైనా లింక్ ఉందా? దీన్ని ఎక్కడి నుంచి కాంగ్రెస్ తీసుకుంది? లోక్ సభలో 400 దాటితే రాజ్యాంగాన్ని మార్చవచ్చా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2024 / 03:30 PM IST

    BJP : ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్.. 400 పార్లమెంట్ సీట్లు కనుక వస్తే మోడీ రాజ్యాంగాన్నే మారుస్తారన్న ప్రచారం బాగా సాగుతోంది. పార్టీని శక్తివంతం చేయడానికి.. కార్యకర్తలకు జోష్ నింపడానికి ఈసారి 400 ఎంపీ సీట్ల నినాదాన్ని మోడీ ఎత్తుకొని ముందుకెళుతున్నారు. అది సాధ్యమా? కాదా.? అన్నది పక్కనపెడితే.. ఇప్పుడు మోడీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా తీసుకెళుతోందంటే.. ‘400 పార్లమెంట్ ఎన్నికలు కనుక మోడీ గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని’ కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది.

    అయితే ఈ ప్రచాన్ని సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో కావడం గమనార్హం. మహబూబ్ నగర్ లో అమిత్ షా రిజర్వేషన్లపై ఏదో మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని ఆయన వీడియోను మార్ఫింగ్ చేసి 400 సీట్లు గనుక వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తాం అన్నట్టుగా ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి వదిలి విష ప్రచారం ప్రారంభించారు.

    రేవంత్ రెడ్డి దీన్ని ప్రతీ మీటింగ్ లో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని రాహుల్ గాంధీ ఇదేదో బాగుంది స్లోగన్ అని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.

    400 సీట్లకు.. రాజ్యాంగాన్ని మార్చడానికి ఏమైనా లింక్ ఉందా? దీన్ని ఎక్కడి నుంచి కాంగ్రెస్ తీసుకుంది? లోక్ సభలో 400 దాటితే రాజ్యాంగాన్ని మార్చవచ్చా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.