అతి ప్రాచీన కాలంలోనే యూదులు, క్రైస్తవులు, ముస్లింలు సముద్ర మార్గంలో వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మతాలు, జాతులతో కేరళకు సంబంధం ఉంది.
దేశ విభజన సమయంలో దేశం నుంచి తిరువనంతపురం రాజు భారత్ నుంచి వేరు కావాలని కోరుకున్నాడు. మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కేరళ వాసియే కావడం గమనార్హం.
దేశం మొత్తం మీద సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ కేరళ. ఏ ఒక్క పార్టీకి కూడా అధికారాన్ని కేరళ ప్రజలు ఇవ్వడం లేదు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రంట్ లతో ఇక్కడ రాజకీయం నడుస్తోంది. నార్త్ తో పోలిస్తే మత ఘర్షణలు చాలా తక్కువ. మత ఆధారంగా నడిచే రాజకీయ పార్టీలు ఎక్కువ.
కేరళ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయమయ్యింది. కేరళ పాలిటిక్స్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
