Telangana : కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం

Telangana : కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం ఉంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : June 27, 2024 7:40 pm

Telangana : తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి. అవి కాంగ్రెస్ కే ఉపయోగపడుతున్నాయా? ప్రత్యర్థి పార్టీలకు ఉపయోగపడుతున్నాయా? వాళ్ల వ్యూహాలు చూస్తుంటే అవి వినూత్నంగా ఉన్నాయి. అనుకోని పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే బోటాబోటీ మెజార్టీతోనే అధికారం సాధించింది. కాంగ్రెస్ కు కంఫర్టబుల్ మెజార్టీ లేదు. రెండో అధికార పార్టీగా బీఆర్ఎస్ ఏర్పడింది. బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది.

అదే లోక్ సభకు వచ్చేటప్పటికి సీన్ మారింది. లోక్ సభలో కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే పోటీ జరిగింది. చెరో 8 ఎంపీ సీట్లు సాధించాయి. ఒకటి ఎంఐఎం గెలిచింది. ఓట్లు చూస్తే 40 శాతం కాంగ్రెస్ కు రాగా.. 35 శాతం బీజేపీ సాధించింది. కేవలం 5 శాతం తేడానే. బీఆర్ఎస్ కు 16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఎదిగిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండాలి.. బీజేపీని దెబ్బతీసేలా ఉండాలి. బీజేపీకి కేవలం 8 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ పై పడ్డారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలను లాగుతున్నారు.

కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం ఉంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.