Semicon India 2024 : సెమీకాన్ ఇండస్ట్రీ.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు.. సింపుల్ గా చెప్పాలంటే.. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో తయారయ్యే చిప్స్ పరిశ్రమ. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన పరిశ్రమ. హైటెక్నాలజీ పరిశ్రమ. ఇవాళ ఎక్కువ పెట్టుబడులతో కూడుకున్న పరిశ్రమ ఏదైనా ఉందంటే అది సెమీ కండక్టర్ పరిశ్రమ.
ఇందులో ఒక్కొక్క కంపెనీ ఒక్కో విభాగాన్ని మాత్రమే తయారు చేయాలి. నెదర్లాండ్ లోని ఓ కంపెనీ ‘ఫాబ్ ’లో దానికి సంబంధించిన ఇన్ స్ట్రూమెంట్ వేరే ఏ కంపెనీలో తీసుకోరు. ఇందులో మూడు ప్రధానంగా చెప్పుకోవాలంటే.. డిజైనింగ్ అంతా అమెరికాలోనే ఉంది. అమెరికా దీని మీద గుత్తాధిపత్యం ఉంది.
అయితే దీన్ని తయారు చేసేది అమెరికాలో తక్కువ. 50 శాతానికంటే ఎక్కువగా తైవాన్ లో తయారవుతాయి. టీఎస్ఎంసీ అనే కంపెనీ తైవాన్ లో పెద్ద ఎత్తున దీన్ని తయారు చేస్తుంది. ఆ తర్వాత సౌత్ కొరియాలోని సామ్ సంగ్ పరిశ్రమ తయారు చేస్తుంది. తర్వాత జపాన్ లో ఇవి తయారవుతాయి.
ఈ తయారీ కూడా ఎన్నో సప్లై చెయిన్ ల నుంచి వచ్చిన వాటిని ఇవి తయారు అవుతాయి. ఈ చిప్స్ తయారీకి అమెరికా పెద్ద ఎత్తున ప్రోత్సహాకాలు అందిస్తోంది. 50 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు చైనా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.
మొదటి సెమీకాన్ భారత్ సదస్సు గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.